మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 13:38:29

నిరుపేదలకు కొండంత అండ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు

నిరుపేదలకు కొండంత అండ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు

సిద్దిపట : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు కొండంత అండనిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు.

మూడేండ్లలో ఏడు లక్షల మంది పేదింటి ఆడ బిడ్డలకు లక్ష రూపాయల చొప్పున సాయం అందించామని తెలిపారు. ఇప్పటి వరకు 5,550 కోట్లు ఆడపిల్లల పెండ్లి కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఆడపిల్లల పెండ్లికి దేశంలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క రూపాయి కూడా సాయం చేయడం లేదన్నారు. పెట్టుబడి సాయం ఇచ్చి రైతును కాపాడుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్  ప్రభుత్వం అన్నారు. బీడీ కార్మికులను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు.


logo