శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 12:56:26

రైతు ఇంటికే పట్టాదారు పాసు పుస్తకాలు : ఎమ్మెల్యే శంకర్ నాయక్

రైతు ఇంటికే పట్టాదారు పాసు పుస్తకాలు : ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ : నియోజకవర్గంలో భూమిని సాగు చేసుకుంటున్న అర్హులైన ప్రతి రైతు ఇంటికే పట్టాదారు పుస్తకాలు అందజేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం హరిహర గార్డెన్ లో కేసముద్రం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 1682 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు రైతుల వద్ద రకం పేరిట డబ్బులు వసూళ్లు చేసేవారు.

కానీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడికి ఎకరాకు 10వేలు ఇస్తూ రైతు పక్షపాతిగా నిలుస్తుందన్నారు. కొన్ని పార్టీలు ప్రజలను, రైతులను కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఇంటికి ఇంటికి తాగు నీరు ,ప్రతి ఎకరాకు సాగు నీరు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా వంటి  పథకాలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఒలం చంద్ర మోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, ప్రభాకర్, సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు మాదరాపు సత్యనారాయణ రావు, నజ్జు, నవీన్ రెడ్డి, దీకొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.