శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 16:18:27

రైతుకు రక్షణగా నూతన రెవెన్యూ చట్టం

రైతుకు రక్షణగా నూతన రెవెన్యూ చట్టం

యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం రైతులకు రక్షణగా నిలువనుందని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టం అమలులోకి రావడంతో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతగా జిల్లా కేంద్రంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. భువనగిరి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ట్రాక్టర్  ర్యాలీని ఎమ్మెల్యే  శేఖర్ రెడ్డి ప్రారంభించారు. 

ర్యాలీ రాయగిరి నుంచి ప్రారంభమై భువనగిరి పాత బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారిలో వినాయక చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భూముల సమస్యలకు పరిష్కారం కోసమే నూతన రెవెన్యూ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. అవినీతి, అక్రమాలకు, కబ్జాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ చట్టం ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo