మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 19:03:13

అచ్చంపేటలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ : పాల్గొన్న మంత్రులు

అచ్చంపేటలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ : పాల్గొన్న మంత్రులు

నాగర్‌కర్నూల్ : నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా జిల్లాలోని అచ్చంపేటలో రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రెవెన్యూ బిల్లును తీసుకు వచ్చినందుకు సీఎం కేసీఆర్ కు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. మంత్రులు స్వయంగా ట్రాక్టర్లు నడుపుతూ రైతుల్లో ఉత్సాహం నింపారు.logo