గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 16:21:19

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి జగదీష్ రెడ్డి

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ : ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ దేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గులాబీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పట్టభద్రుల ఓటర్లను నమోదు చేయడంలో పార్టీ శ్రేణులు చొరవ చూపాలన్నారు. రెవెన్యూ చట్టంలో తీసుకొచ్చిన సవరణలు విప్లవాత్మకమైనవని పేర్కొన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్  బలపర్చిన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


logo