గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 18:05:23

సుందర పాలమూరుగా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సుందర పాలమూరుగా తీర్చిదిద్దుతాం :  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌-జడ్చర్ల రోడ్డు విస్తరణతోపాటు జిల్లా కేంద్రంలోని రోడ్లను, చౌరస్తాలను విస్తరించి సుందరంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ, టీచర్స్‌ కాలనీ, మర్లు, పాల్కొండలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, డివైడర్‌ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే వడ్డెర బస్తీలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులకు జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో పాలమూరు వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడేవారని, మిషన్‌ భగీరథతో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందన్నారు. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కౌన్సిలర్లతో కలిసి ప్రతి వార్డులో పర్యటించి సమస్యల పరిష్కరానికి కృషి చేశామని గుర్తు చేశారు. ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే రోజుల్లో మరిన్ని చేపడుతామని తెలిపారు. కరెంటు కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.


ఇప్పటికే మయూరి పార్కును అభివృద్ధి చేశామని, కేసీఆర్‌ ఈకో పార్కును అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్‌ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచేలా కృషి చేస్తామన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, ఎంఈ సత్యనారాయణ, కౌన్సిలర్లు కట్టా రవికిషన్‌రెడ్డి, నీరజా విఠల్‌రెడ్డి, నరేందర్‌, అనంతరెడ్డి, మున్సిపల్‌ కోఆప్షన్‌ అర్షద్‌అలీ, మాజీ కౌన్సిలర్‌ విఠల్‌రెడ్డి, నాయకులు  వెంకటేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, అంజద్‌ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు


logo