మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 16:36:24

ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే కృష్ణారావు

ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే కృష్ణారావు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా కృషి చేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం బేగంపేట డివిజన్‌లోని మాతాజీనగర్‌లో రూ.14లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను బేగంపేట కార్పొరేటర్‌ ఉప్పల తరుణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు.

ఈ క్రమంలో బేగంపేట డివిజన్‌లో కూడా అనేక రకాల సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ప్రధానంగా వర్షం పడితే గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు అర్థమైందని అన్నారు. దీంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ధనాలగుట్ట శ్మశాన వాటికను అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దునున్నామని తెలిపారు. ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో బేగంపేట టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 


logo