గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 15, 2020 , 15:22:45

పేదింటి యువతుల పెద్దన్న సీఎం కేసీఆర్ : ప్రభుత్వ విప్‌ గాంధీ

పేదింటి యువతుల పెద్దన్న సీఎం కేసీఆర్ : ప్రభుత్వ విప్‌ గాంధీ

హైదరాబాద్ : పేదింటి ఆడపిల్లలకు పెద్దన్నగా మారి సీఎం కేసీఆర్‌ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో భరోసాగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. లబ్ధిదారులకు మంజూరైన  కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌  చెక్కులను వివేకానందనగర్‌లోని తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈపథకంతో పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆసరాగా మారుతుందన్నారు. 

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గోవర్థన్‌, వీఆర్‌వో యాదగిరి, దన్‌రాజ్‌, గంధం రాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌యాదవ్‌, ఊరిటి వెంకట్రావ్‌, సైదేశ్వర్‌రావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


logo