శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 15:27:01

టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం తీసుకరావడంతో టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో.. ఆర్ట్స్ కళాశాల ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో పల్లెల్లో పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ చట్టంతో ప్రజలకి మేలు కలుగుతుందన్నారు. వీఆర్వో వ్యవస్థతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.  


logo