ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 12:17:15

ప్రజల్లో చైతన్య దీప్తిని వెలిగించిన గొప్ప వ్యక్తి కాళోజీ : మంత్రి సత్యవతి

ప్రజల్లో చైతన్య దీప్తిని వెలిగించిన గొప్ప వ్యక్తి  కాళోజీ : మంత్రి సత్యవతి

హైదరాబాద్ : పుటక నీది చావు నీది. బతుకంతా దేశానిది అని మనిషి ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన మానవతావాది కాళోజీ అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా శాసన మండలిలో మంత్రి కాళోజీ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా పోరాడారని మంత్రి తెలిపారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.


logo