మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:13:27

సభలు సజావుగా జరగాలి

సభలు సజావుగా జరగాలి

  • మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగా ణ: ఉభయసభలు సజావుగా సాగే లా, సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యేలా, చర్చల్లో చురుగ్గా పాల్గొనేలా విప్‌లు సమన్వయపర్చాలని శాసనసభ వ్యవహరాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. సోమవా రం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానంతరం ప్రభుత్వ చీఫ్‌విప్‌లు, విప్‌లతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభల్లో ప్రభుత్వ చీఫ్‌విప్‌లు, విప్‌లు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. సభానాయకుడు , ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆలోచనలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పాలసీలు, ప్రజా సమస్యలపై ఉభయసభల వేదికగా అర్ధవంతమైన విస్తృత చర్చలు జరిపేలా విప్‌లు కీలకపాత్ర పోషించాలని అన్నారు. సభలను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు సీఎం సు ముఖంగా ఉన్నందున బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో ప్రభు త్వ చీఫ్‌ విప్‌లు బీ వెంకటేశ్వర్లు, దాస్యం వినయ్‌భాస్కర్‌, విప్‌లు గంప గోవర్ధన్‌, గొంగిడి సునీత, బాల్క సుమన్‌, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, టీ భానుప్రసాదరావు, ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.


logo