మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 20:19:50

ఎస్సారెస్పీలో చేపల వేట ప్రారంభం

ఎస్సారెస్పీలో చేపల వేట ప్రారంభం

నిజామాబాద్ : ఏటా రెండు నెలలపాటు చేపల వేటపై కొనసాగే నిషేధం ముగియడంతో ఎస్పారెస్పీలో చేపల వేట మొదలైంది. నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో వేలాది మత్స్యకారులకు ఎస్సారెస్పీలో చేపల వేట ద్వారా ఉపాధి లభిస్తుంది. చేప పిల్లల ఉత్పత్తి జరిగే కాలం కావడంతో జూలై, ఆగస్టులో వేటను నిషేధిస్తారు. ఈ కాలంలో ఎస్సారెస్పీలో చేపల వేటకు దూరంగా ఉండే మత్స్యకారులు సెప్టెంబర్‌ నెల ప్రారంభం కాగానే వేటకు సిద్ధమవుతారు.

నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు చెందిన సుమారు 6 వేల మంది మత్స్యకారులు ఎస్సారెస్పీలో చేపల వేటపై ఆధారపడి ఉపాధి పొందుతారు. ఎస్సారెస్పీలో ఏటా జూలైలో చేప పిల్లలు వదులుతారు. గత సంవత్సరం 84 లక్షల చేప పిల్లలను వదిలారు. సరిగ్గా ఏడాది తిరిగే సరికి వాటి బరువు కిలోకు చేరుతుంది. దీంతో వేటాడ దగ్గ బరువులో చేప సెప్టెంబరుకల్లా ఉంటుంది. దీంతో హుషారుగా వేటకు దిగుతారు.  


logo