సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 18:40:38

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు : మ‌ంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు : మ‌ంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

హైద‌రాబాద్ : భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర విలువైంది. విద్యార్థుల భవిష్యత్తు దిశా నిర్దేశకులు ఉపాధ్యాయులేనని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి  అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబ‌ర్ 5) సందర్భంగా ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 

విద్య నేర్పిన గురువులను పూజించే గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉందన్నారు. మహానీయుడు అబ్దుల్‌ కలాం చెప్పినట్లు విద్యార్థుల్లో మంచి లక్షణాలను పెంపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలకమన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడ‌మే సీఎం కేసీఆర్ లక్ష్యమ‌ని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టార‌ని తెలిపారు.


logo