శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 19:02:57

ఎస్సారెస్పీలో మత్స్యకారుడి వలకు చిక్కిన 29 కేజీల బొచ్చ చేప

ఎస్సారెస్పీలో మత్స్యకారుడి వలకు చిక్కిన 29 కేజీల బొచ్చ చేప

నిర్మల్‌ : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి తాను ఊహించని విధంగా భారీ చేప చిక్కడంతో ఆనందంతో తబ్బిబ్బిపోయాడు. జిల్లాలోని సోన్‌ మండలం గాంధీనగర్‌ గ్రామ శివారులోని ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ లో భారీ చేప చిక్కింది. వెల్మల్‌ బొప్పారం గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు పసుపుల ప్రకాశ్‌ గురువారం చేపలు పట్టేందుకు ఎస్సారెస్పీలో వల వేశాడు. అరగంటలోనే భారీ బొచ్చ చేప వలకు చిక్కడంతో దానిని బయటకు తీశాడు.

దాని బరువు 29 కిలోలు ఉంది. ఇంత బరువున్న చేప చిక్కిడం ఇదే మొదటిసారి అని ప్రకాశ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. దీనిని రూ. 3 వేల వరకు విక్రయించనున్నట్లు తెలిపాడు. భారీ చేపను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.


logo