శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 00:51:28

స్టైల్‌ లేకపోతేనేం, సరుకుంది!

స్టైల్‌ లేకపోతేనేం, సరుకుంది!

అనూహ్యమైన రీతిలో పీవీ ప్రధానిగా రంగం మీదకు వచ్చినప్పుడు భారతీయులకు ఆయన గురించిన సరైన అంచనాలు లేవు. కానీ ముందుగా ఆయన నాయకత్వం మీద విదేశాల్లో హర్షం వ్యక్తం కావడం విశేషం. పీవీ పాలనపై పుస్తకం రాసిన వినయ్‌ సేతుపతి ఆయనను భారతదేశపు డెంగ్‌గా అభివర్ణించారు. కానీ లండన్‌ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ డెంగ్‌ను, పీవీని 1991లోనే పర్సన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ప్రకటించింది. పీవీ రాకతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయని, లైసెన్స్‌-పర్మిట్‌ రాజ్‌ కు తెరవేస్తారని ప్రపంచ నేతలు అంచనా వేశారు. ముఖ్యంగా జర్మనీ నేత హెల్మట్‌ కోల్‌ పీవీ పాలనపై జోస్యం లాంటిది చెప్పారు. పీవీ అదివరకటి ప్రధాని రాజీవ్‌ గాంధీలాగా స్టైలిష్ ‌గా లేని మాట వాస్తవమేనని అన్నారు. అయితే పీవీ సరుకున్న నేత అని ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు స్టైల్‌‌ కన్నా పీవీలాంటి సరుకున్న నేత ఎంతో అవసరమని కోల్‌ వ్యాఖ్యానించారు. ఇక క్రిస్టియన్‌ సైన్స్‌ మానిటర్‌ పత్రికేమో పీవీ తన అసమానమైన నాయకత్వ పటిమతో నెహ్రూను వెనకకు నెట్టేస్తారని ప్రశంసించింది.


logo