శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 00:51:28

80 ఏళ్ల వయసులో తెలుగు టైపింగ్‌తో కుస్తీ

80 ఏళ్ల వయసులో తెలుగు టైపింగ్‌తో కుస్తీ

పీవీ నరసింహారావు 1986 ప్రాంతంలోనే కంప్యూటర్‌ నేర్చకోవడమే గాకుండా అందుకు సంబంధించిన కోబాల్‌ తదితర భాషలను కూడా ఔపోసన పట్టిన సంగతి తెలిసిందే. కంప్యూటర్‌ మీదనే రచనలు చేసేవారు. ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయాక తాను రచించిన భారీ నవల ‘ఇన్సైడర్‌' అందులో ఒకటి. దానిని ‘లోపలి మనిషి’ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చే సమయంలో ఎమ్మెస్కో బుక్స్‌ పబ్లిషర్‌ విజయ్‌కుమార్‌ ఆ నవలలో  కొన్నిచోట్ల మార్పులు చేయాలని పీవీని కోరారు. అయితే అందుకు పీవీ మొదట ఒప్పుకున్నా ఆ తరువాత ససేమిరా అన్నారు. కొద్దిరోజుల తరువాత పీవీనే మళ్లీ విజయ్‌కుమార్‌ ఫోన్‌ చేసి.. ‘ఏమయ్యా నేను తెలుగు టైపింగ్‌ నేర్చుకోవాలనుకుంటున్న. చేతితో రాయాలంటే బద్ధకంగా ఉంది. నువ్వు చెప్పిన మార్పులను వద్దనడానికి అసలు కారణం అదే. డీటీపీ నేర్పేవాళ్లు ఎవరైనా ఉంటే పంపించు’ అని అడగడం విశేషం. ఆ తరువాత విజయ్‌కుమార్‌ తనవద్ద పనిచేసే పిల్లవాడిని ఢిల్లీ పంపడంతో 80 ఏళ్ల వయస్సులోనూ ఆయన తెలుగు డీటీపీ నేర్చుకోవడం మరో విశేషం. 


logo