ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 11:49:12

సర్వమత సమ్మేళనం భారతదేశం : మంత్రి ఎర్రబెల్లి

సర్వమత సమ్మేళనం భారతదేశం : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ : జిల్లాలోని  పర్వతగిరి మండల కేంద్రంలో విఘ్నేశ్వరుని మండపంలో వినాయకునికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూజలు నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వరుని మండపం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన ఆచార సంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. సర్వమత హితం మన విధానమన్నారు. 

ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వల్ల ఈ పండుగను ప్రభుత్వ నిబంధనలకు లోబడి మన పరిమితి మేరకు జరుపుకుంటున్నాం. అయినా కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి  ప్రజలకు సూచించారు.logo