బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 18:00:36

అవ‌య‌వ దానం చేసిన డాక్టర్ ప్రసాద శ‌ర్మ సిద్ధాంతి

 అవ‌య‌వ దానం చేసిన డాక్టర్ ప్రసాద శ‌ర్మ సిద్ధాంతి

వ‌రంగ‌ల్ రూర‌ల్ : తెలంగాణ బ్రాహ్మణ సేవా స‌మితి ఆస్థాన సిద్ధాంతి డాక్టర్ ఎ. ప్రసాద శ‌ర్మ సిద్ధాంతి త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా జీవ‌న్ దాన్ కింద అవ‌య‌వ దానం చేశారు. ఈ మేర‌కు జీవ‌న్ దాన్ పత్రాల‌పై సంత‌కాలు చేశారు. పర్వతగిరిలోని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కార్యాల‌యం క‌లిసి, మంత్రి సమక్షంలో ఆ విష‌యాన్ని ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రసాద శ‌ర్మ సిద్ధాంతి త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మంచి నిర్ణయం తీసుకున్నార‌న్నారు. మ‌న అనంత‌రం మ‌న అవ‌య‌వాలు మ‌రికొంద‌రికి జీవం పోస్తాయ‌న్నారు. అవ‌య‌వ దానాన్ని ప్రోత్సహించాలని, అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచిన సిద్ధాంతిని మంత్రి అభినందించారు. 


logo