శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 15:52:39

అభివృద్ధి, సంక్షేమం చూసే టీఆర్ఎస్ లో చేరికలు

 అభివృద్ధి, సంక్షేమం చూసే టీఆర్ఎస్ లో చేరికలు

నాగర్ కర్నూల్ :  టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో మాజీ జెడ్పీటీసీ రాణి యాదవ్, కాంగ్రెస్ జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు గాలి యాదవ్ తదితరులు ఉన్నారు.            logo