శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 17:00:25

దివాలకోరుతనానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ : మంత్రి జగదీష్ రెడ్డి

దివాలకోరుతనానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ : మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట : అభివృద్ధిని అడ్డుకుంటూ కాంగ్రెస్ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోయారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ కు కంచు కోటగా మారిందన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సమక్షంలో నియోజకవర్గంలోని నాగారం జడ్పీటీసీ ఇందిరా పరమేశ్వర్, వర్ధమాన్ కోట ఎంపీటీసీ పరుశరాములు ,మరో 400 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి పెద్ద ఎత్తున ప్రజలు టీఆర్ఎస్ లోకి వచ్చి చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ దివాలుకోరుతనాన్ని చూసి ప్రజలు అస్యహించు కుంటున్నారని మంత్రి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గోదావరి, కృష్ణా, మూసీ, నదుల నీళ్లతో సస్యశ్యామలంగా మారిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 20 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు చరిత్ర సృష్టించారని వివరించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్, వైస్ ఛైర్మన్ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్ఎస్ తదితరులు పాల్గొన్నారు.logo