ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 16:03:49

కార్యకర్త తండ్రి పాడె మోసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

కార్యకర్త తండ్రి పాడె మోసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ : రాజకీయ పార్టీలకు కార్యకర్తలే వెన్నెముక లాంటి వారు. తాము నమ్మిన పార్టీ అధికారంలోకి రావడం కోసం కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తుంటారు. కుటుంబాలకు సైతం దూరమై నమ్మిన పార్టీ కోసం కడవరకు వెన్నంటే ఉంటారు. అయితే చాలా పార్టీలు వారిని ఎన్నికలు అయిపోగానే విస్మరిస్తుంటాయి. కానీ, టీఆర్ఎస్ పార్టీ అలా కాదు అని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కష్టకాలంలోనూ అండగా ఉంటామని నిరూపించారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త, సింగల్ విండో చైర్మన్ వెంకటయ్య తండ్రి కావలి చెన్నయ్య అంతిమ సంస్కారాలకు మంత్రి  హాజరయ్యారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని మంత్రి  ఈ సందర్భంగా తెలిపారు.


logo