ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 16:00:44

పల్లె ప్రగతి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు ప్రశంసనీయం

పల్లె ప్రగతి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు ప్రశంసనీయం

రంగారెడ్డి : పల్లె ప్రగతిలో మన జిల్లా ప్రథమ స్థానంలో నిలపటంలో అందరి కృషి ఉందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని నెదనూరు నుంచి పులిమామిడి వరకు రూ.6కోట్ల 35 లక్షలతో నిర్మించనున్నబీటి రోడ్డు పనులకు, రూ.30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులు, రూ.5 లక్షలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైజీ పనులు, దాసర్లపల్లి తండాలో రూ. 80 లక్షల తో మన్నేగూడ తండా నుంచి నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. రాష్టం నుండి జీఎమ్ జీఎస్ వై కింద 1200 కిలోమీటర్ల కు సంబంధించి 158 రోడ్లకు రూ. 658 కోట్లు నిధులు విడుదల అయ్యాయని మంత్రి వెల్లడించారు. నెదనూరు నుంచి పులిమామిడి, మహేశ్వరం వరకు డబల్ రోడ్డుకు రూ. 11 కోట్ల 50 లక్షల తో నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొదటి దశ పనులు ప్రారంభం అయ్యాయని, త్వరలో మిగతా వాటికి శంకుస్థాపన లు చేయనున్నట్లు పేర్కొన్నారు. కరోనా కాలంలో ఉచిత బియ్యం అందించి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 

రాష్ట్రంలోనే మొట్టమొదటగా నిర్మించిన మహేశ్వరం రైతు వేదికను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో పల్లె ప్రగతి బాగా జరిగిందని, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపట0లో చొరవ చూపిన అధికారులు, సర్పంచ్ లను అభినందించారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము కాకుండా పని చేస్తానని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 


logo