గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 13:30:50

ఏఎస్పీ దక్షిణామూర్తి మరణం బాధాకరం : మంత్రి ఎర్రబెల్లి

ఏఎస్పీ దక్షిణామూర్తి మరణం బాధాకరం : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి మృతికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక కాలం విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందిన వ్యక్తి దక్షిణామూర్తి అన్నారు. కరోనాతో అతడు చనిపోవడం చాలా బాధాకరమని మంత్రి ఎర్రబెల్లి విచారం వ్యక్తం చేశారు.

మేడారం జాతర స్పెషల్ ఆఫీసర్ గా మంచి అనుభవం ఉన్నపోలీస్ అధికారిగా గుర్తింపు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.  వరంగల్ ప్రాంతంలో ఎక్కువ కాలం పని చేయడం ద్వారా వారితో నాకు మంచి అనుబంధం ఉండేదన్నారు. ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరి సీఐ, డీఎస్పీ, ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు అంటే వారు ఎంత బాధ్యతగా పని చేసేవారో అర్థమవుతుందన్నారు. దక్షిణామూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


logo