ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 13:35:41

ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఖమ్మం పట్టణం 5వ డివిజన్ లో ముమ్మరంగా కొనసాగుతున్న ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 4వ తేదీన చెరువును మంత్రి సందర్శిచి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. చెరువును లకారం ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

చెరువుకు చుట్టూ విశాలమైన బండ్ నిర్మించి, ఒకవైపు ఫెన్సింగ్ మరో వైపు మొక్కలతో గ్రీన్ వాల్, గ్రీనరీ, లైటింగ్, అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అతి త్వరలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖమ్మం నగరంలో భాగంగా ఉన్న ఈ చెరువును అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల ఉన్న డివిజన్ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు, వాకింగ్, యోగా, చిన్నపిల్లలు ఆదుకోవడానికి పార్క్ లా ఉపయోగపడుతుందన్నారు.


logo