ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 12:27:53

పల్లెల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి ఎర్రబెల్లి

పల్లెల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్: జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు శాయంపేట మండలంలో పర్యటిస్తున్నారు. కొత్తగట్టు సింగారం గ్రామంలో పంచాయతీ కార్యాలయం భవనాన్ని ప్రారంభించిన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..పల్లెల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.logo