ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 13:36:55

రాష్ట్రంలో జోరుగా కురుస్తున్న వర్షాలు...ప్రాజెక్టులకు జలకళ

రాష్ట్రంలో జోరుగా కురుస్తున్న వర్షాలు...ప్రాజెక్టులకు జలకళ

హైదరాబాద్:  భూ ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లు కొట్టుకు పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువులోకి భారీగా నీరు చేరడంతో చెరువు అలుగు దుంకుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రం సమీపంలో పల్లె వెలుగు బస్సు పై పడ్డ భారీ వృక్షం విరిగి పడింది. కండక్టర్ కు స్వల్ప గాయాలు. తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 


logo