బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 01:32:28

తుపాకీ పేలిందా.. పట్టేస్తుంది!

తుపాకీ పేలిందా.. పట్టేస్తుంది!

అత్యాధునిక రాడార్లు అభివృద్ధి చేసిన డీఆర్డీవో - త్వరలో సైన్యానికి అందజేత 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చాటుమాటుగా కాల్పులకు తెగబడుతూ భారత సైన్యాన్ని కవ్విస్తున్న పాక్‌ ఆటలు ఇకపై సాగవు. శత్రువులు ఎక్కడినుంచి తుపాకీ పేల్చారో కచ్చితంగా గుర్తించే అత్యాధునిక రాడార్లను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. మేకిన్‌ ఇండియాలో భాగంగా రూపొందించిన ‘వెపన్‌ లొకేటింగ్‌ రాడార్‌' (డబ్ల్యూఎల్‌ఆర్‌ఎస్‌) త్వరలో సైన్యం అమ్ముల పొదిలో చేరనున్నాయి. వీటికి స్వాతి అని పేరు పెట్టారు. రూ.400 కోట్లతో ఆరు రాడార్లను సైన్యానికి అందించేందుకు డిఫెన్స్‌ అక్విషన్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. సరిహద్దు వెంబడి జరిగే కవ్వింపు చర్యలను గుర్తించడానికి ఈ రాడార్లను అభివృద్ధి చేశారు. ఇది తుపాకులు, మోర్టార్లు, రాకెట్‌ లాంచర్లు ఎక్కడి నుంచి పేలాయో కచ్చితంగా గుర్తించి సమాచారం ఇస్తుంది. దీనిని ట్రక్కులో అమర్చి ఎక్కడైనా మోహరించేందుకు వీలుంటుంది.

తాజావార్తలు


logo