గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 07, 2020 , 14:15:19

రసాభాసాగా చౌటుప్పల్ కో ఆప్షన్ ఎన్నికలు

రసాభాసాగా చౌటుప్పల్ కో ఆప్షన్ ఎన్నికలు

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని చౌటుప్పల్ కో ఆప్షన్ ఎన్నికల పర్వం రసాభాసాగా కొనసాగుతున్నది. అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని మభ్యపెట్టి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తమ వైపుకు తిపుకున్నారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ నాయకులు సభను వాయిదా వేయాలని పట్టుబట్టారు. 

ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పై చేయిచేసుకోవడంతో సమావేశం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్ ఎన్నికకు రావడం పట్ల టీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికను వాయిదా వేయాలని పట్టుబట్టారు. తీవ్ర ఉద్రిక్తల నడుమ ఎన్నికల కొనసాగుతున్నది.


logo