శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Aug 07, 2020 , 13:40:44

సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చిన మంత్రి కేటీఆర్

సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : సమాజానికి సంస్కృతిని నేర్పిన నేర్పరులు చేనేత కార్మికులని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చేనేత హస్త కళ నైపుణ్యం అద్భుతంగా ఉంటుందన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన గొప్ప కళాకారులని ప్రశంసించారు.

ఒకప్పుడు చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఉండేవన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతన్నలను ఆదుకోవడానికి అనేక పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. సిరిసిల్ల అంటే..ఉరి సిల్ల అని ఒకప్పుడు తాటికాయంత అక్షరాలతో మీడియా రాసేది. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యాక సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  చేనేతల కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. 


దేశంలో చేనేత కార్మికుల కష్టాలను గుర్తించిన ఏకైక సర్కారు తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. సీఎం కేసీఅర్ మార్గ నిర్దేశనంలో నేత కార్మికులకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ప్రజలకు బహుమతిగా చేనేత బట్టలు పంపిణీ చేస్తున్నది. చేనేతలకు మౌలిక, మార్కెటింగ్ వంటి సదుపాయాలు, సబ్సిడీలు ప్రభుత్వం కల్పిస్తున్నదని పేర్కొన్నారు.



logo