సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 16:00:38

ఉద్యమాలే ఊపిరిగా బతికిన సోలిపేట : మంత్రి నిరంజన్ రెడ్డి

ఉద్యమాలే ఊపిరిగా బతికిన సోలిపేట : మంత్రి నిరంజన్ రెడ్డి

సిద్దిపేట : అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి వ్యవసాయ శాక మంత్రి నిరంజన్ రెడ్డి నివాళులర్పించారు. మృతి వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి దుబ్బాక వెళ్లిన మంత్రి..సోలిపేట పార్థీవదేహంపై పూల మాల వేసి వాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నా రు. జీవితం మొత్తం ఉద్యమాలే ఊపిరిగా బతికిన రామలింగారెడ్డి చిరస్మరణీయుడని ఆయన సేవలను కొనియాడారు.


logo