శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 14:22:40

వందేండ్ల ముందు చూపుతో సీఎం కేసీఆర్ పాలన

వందేండ్ల ముందు చూపుతో సీఎం కేసీఆర్ పాలన

నాగర్‌కర్నూల్ జిల్లా :  గుడిపల్లి రిజర్వాయర్ ప్యాకేజీ 29,30 నుంచి సాగు నీటిని వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  విడుదల చేశారు. మొదటగా ప్యాకేజీ 29 వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి గేట్లు ఎత్తి నాగర్ కర్నూల్ నియోజకవర్గనికి సాగు నీటిని విడుదల చేశారు. అనంతరం ప్యాకేజీ 30 దగ్గర కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీటిని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత ఏడాదిలో ‌జూలై, ఆగస్టులో నీటి విడుదల జరిగితే ఏప్రిల్ దాకా నీళ్లు పారాయని తెలిపారు. దీంతో చెరువుల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. యాసంగికి కూడా ఢోకా ఉండదన్నారు. తొలినాళ్లలో రైతుల్లో ఆతృత ఉండేది. ఇప్పుడు చాలినన్ని నీళ్లు ఉన్నాయి. కాల్వలు, చెరువులకు గండి పెట్టవద్దని రైతులకు సూచించారు. మెట్టపంటలు కంది, పత్తి బాగున్నాయి. కరోనా నేపథ్యంలో వ్యవసాయం ప్రభావం పడకుండా పంటలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.


అలాగే రాష్ట్రానికి ఆదాయం 50వేల కోట్లు రాలేదు. అయినప్పటికి నష్టమున్నా 7,253 కోట్ల రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సీఎం కేసీఆర్ వందేళ్ల ముందు చూపుతో పనిచేస్తున్నారని కొనియాడారు. పాలమూరు-రంగారెడ్డి‌70% పనులు పూర్తయ్యాయి. ఏదుల, వట్టెం‌లో 90% పనులు వచ్చే వానాకాలానికి‌, 2021 జూన్, జూలై నాటికి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా నీళ్లు అందజేస్తామన్నారు. అలాగే తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ పద్మావతి ఉన్నారు. 

logo