బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 13:02:27

కురిసిన చినుకు..మురిసిన రైతు

కురిసిన చినుకు..మురిసిన రైతు

మహబూబ్ నగర్ :  జిల్లాలో వర్షం దంచి కొట్టింది. కొన్ని చోట్ల భారీ వర్షం కురువగా..మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసింది.  కోయిల్ కొండ, హన్వాడ మండలాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.  వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు నిండాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడటంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. జోరుగా కురుస్తున్న వర్షాలకు రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. వానలు సంమృద్ధిగా కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
logo