శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 12:36:24

గులాబీ గూటికి కొండాపూర్ కాంగ్రెస్ నేతలు

గులాబీ గూటికి కొండాపూర్ కాంగ్రెస్ నేతలు

సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు వరుస పెట్టి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. మూడు రోజుల క్రితం సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడితో పాటు ఎంపీటీసీ, సర్పంచ్ లు టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. 

తాజాగా ఆదివారం కొండాపూర్ జెట్పీటీసీ పద్మావతి,  కొండాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్, శివన్న గూడెం, మన్సాన్పల్లి, సీహెచ్ కోనాపూర్, మల్లేపల్లి, గంగారం, హరిదాసు పూర్ గ్రామ సర్పంచులు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.  దీంతో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ అయ్యింది.logo