శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:51:21

4.5 లక్షలు దాటిన టెస్టులు

4.5 లక్షలు దాటిన టెస్టులు

  • \l ఒక్కరోజే 21,011 నిర్ధారణ పరీక్షలు
  • l రాష్ట్రంలో రికవరీ రేటు 71.7 శాతం
  • l శుక్రవారం 2,083 మందికి పాజిటివ్‌
  • l 11 మంది మృతి, 1,114 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. శుక్రవారం 21,011 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 4,58,593కు చేరుకున్నట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో ఒక్కరోజే 2,083 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 578 కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 228, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 197, వరంగల్‌అర్బన్‌లో 134, కరీంనగర్‌లో 108, సంగారెడ్డిలో 101, నిజామాబాద్‌లో 73, నల్లగొండలో 48, పెద్దపల్లిలో 42, మహబూబాబాద్‌లో 40, రాజన్నసిరిసిల్ల, వరంగల్‌రూరల్‌లో 39 చొప్పున, మంచిర్యాలలో 37, భద్రాద్రి కొత్తగూడెం, జోగుళాంబగద్వాలలో 35 చొప్పున, సూర్యాపేటలో 34, ఖమ్మంలో 32, మహబూబ్‌నగర్‌లో 31, నిర్మల్‌లో 25, జయశంకర్‌ భూపాలపల్లిలో 24, వికారాబాద్‌, జగిత్యాల, జనగామలో 21 చొప్పున, ములుగులో 19, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌లో 18 చొప్పున, ఆదిలాబాద్‌లో 17, మెదక్‌, సిద్దిపేటలో 16 చొప్పున, యాదాద్రిభువనగిరిలో 10, వనపర్తి, నారాయణపేటలో 9చొప్పున, కుమ్రంభీంఆసిఫాబాద్‌ జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. కరోనాకుతోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 11 మంది మరణించగా, మొత్తం మృతులసంఖ్య 530కి చేరుకున్నది. ఒక్కరోజే 1,114 మంది కోలుకోగా, మొత్తం 46,502 మంది రికవరీ అయ్యారు. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు      శుక్రవారం మొత్తం 

పాజిటివ్‌ కేసులు 2,083 64,786  

డిశ్చార్జి అయినవారు     1,114 46,502

మరణాలు   11   530

చికిత్స పొందుతున్నవారు     - 17,754


logo