శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 15:30:34

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రులు

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రులు

మహబూబ్ నగర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ఫేస్-1,2,3 పనులను మంత్రులు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సాగునీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పరిశీలించారు. ప్రాజె క్ట్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల ప్రగతి నమూనాలను ఫొటో గ్యాలరీ ద్వారా పరిశీలించారు.

కార్యక్రమంలో ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాములు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. logo