ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 12:58:12

నిరు పేదల పాలిట వరం ‘సీఎంఆర్ఎఫ్’

నిరు పేదల పాలిట వరం ‘సీఎంఆర్ఎఫ్’

మహబూబాబాద్ : పేదల పాలిట సీఎంఆర్ ఎఫ్ పథకం వరంలా మారిందని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అందచేశారు. మహబూబాబాద్ పట్టణంలో అనారోగ్యానికి గురైన 18 మంది బాధితులకు మంజురైన ఆరు లక్షల పదమూడు వేల రూపాయలు (6,13,000) చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా.. ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు సైతం సీఎం కేసీఆర్ వర్తింపజేసి ఆదుకుంటున్నారని తెలిపారు. logo