మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 18:55:08

రైతుల పాలిట దైవం.. సీఎం కేసీఆర్

రైతుల పాలిట దైవం.. సీఎం కేసీఆర్

వరంగల్ రూరల్ : సీఎం కేసీఆర్ రైతుల పాలిట దైవంగా మారారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి అన్నారు. నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామంలో రూ. 22 లక్షలతో రైతు వేదిక నిర్మాణ పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రైతు వేదికలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని నూతన పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. 

కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ బొల్లె భిక్షపతి పంచాయతీరాజ్ శాఖ డీఈ లింగారెడ్డి, నడికూడ మండల రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ సుధాటి వెంకటేశ్వరరావు, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొజ్జం రమేష్ తదితరులు పాల్గొన్నారు.


logo