సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 13:16:47

ఎమ్మెల్యే సోలిపేటని పరామర్శించిన మంత్రి హరీష్ రావు

 ఎమ్మెల్యే సోలిపేటని పరామర్శించిన మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : శాససనభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలి లోని  ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలాజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కాగా,  ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు  సోలిపేటను పరామర్శించారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో మాట్లాడి  ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. రామలింగారెడ్డి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని మంత్రి ఆకాంక్షించారు.logo