ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 14:14:57

రైతుల కష్టాలను తీర్చేందుకే రైతు వేదికల నిర్మాణం

రైతుల కష్టాలను తీర్చేందుకే రైతు వేదికల నిర్మాణం

జయశంకర్ భూపాలపల్లి  : అన్నదాతలు రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జిల్లాలోని చిట్యాల మండలం జూకల్, చిట్యాల  గ్రామంలో  రూ. 22 లక్షల అంచనా వ్యయంతో  రైతు వేదిక భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతు వేదికల్లో పంట వివరాలు తదితర అంశాలు అధికారులకు నివేదికలు ఇవ్వాలన్నారు.  దీంతో రైతుల సమస్యలు సులువుగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.

సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను దూరం చేసేందుకే రైతు వేదికలు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం రైతువేదిక వద్ద మొక్కలునాటారు. కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద, జడ్పీటీసీ గొర్రె సాగర్,  పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంభం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo