బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 12:21:24

సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి పువ్వాడ

సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి పువ్వాడ

ఖమ్మం :  ఖమ్మం నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

వృద్ధులకు పెద్ద కొడుకుగా, ఆడపిల్లలకు మేనమామగా, రైతులకు రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ , ఆర్డీవో రవీంద్రనాథ్, తహశీల్దార్లు శ్రీనివాసరావు, నర్సింహారావు కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.logo