శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 17:14:26

పుకార్లు నమ్మొద్దు..సరిపడా యూరియా : మంత్రి నిరంజన్‌రెడ్డి

పుకార్లు నమ్మొద్దు..సరిపడా యూరియా : మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌:  రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, కొరత ఉందంటూ కొందరు ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కరోనా ముప్పును గ్రహించే  సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పలు మినహాయింపులతోపాటు వెసులుబాటు ప్రకటించారని మంత్రి చెప్పారు. ఈ వానకాలానికి కావాల్సిన అన్నిరకాల ఎరువులు కలిపి మొత్తం 22.30 లక్షల మెట్రిక్‌టన్నులు కాగా, ఇందులో 10.50 లక్షల మెట్రిక్‌న్నులు యూరియా వుంది.

ఈ మొత్తం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. దీనిని దశల వారీగా రాష్ర్టానికి తీసుకు వస్తున్నట్టుచెప్పారు. జూలై నెల కోటా కేంద్రం సకాలంలో సరఫరా చేయలేదు. దీంతో వెంటనే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రితో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. స్వయంగా వ్యవసాయశాఖ మంత్రిగా తానువెళ్లి కేంద్ర మంత్రిని కలిసినట్టు తెలిపారు. దీంతో వెంటనే జూలై కోటా సరఫరా మొదలుపెట్టిందన్నారు.

ఈనె లకు రావాఇల్సన కోటా 2.05 లక్షల మెట్రిక్‌టన్నులకుగాను 1.06 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా వచ్చిందని వెల్లడించారు. మిగిలిన మొత్తం ఈ నెలాఖరులో ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపినట్టు చెప్పారు. పుకార్లను రైతులు నమ్మొద్దని మంత్రి కోరారు.logo