బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 14:05:00

నాడు మొక్క..నేడు వృక్షం..తన్మయత్వం చెందిన మంత్రి

నాడు మొక్క..నేడు వృక్షం..తన్మయత్వం చెందిన మంత్రి

ఖమ్మం : గతంలో హరితహారంలో భాగంగా తాను నాటిన మొక్క నేడు వృక్షంగా మారడంతో ఆ మంత్రి తన్మయత్వం చెందారు. హరిహారంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారుతుండటంతో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన పథకానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.


ఆదివారం వీడీవోస్ కాలనీ క్యాంపు కార్యాలయంలో  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చిన మంత్రి పువ్వాడ.. మూడో విడత హరితహారంలో భాగంగా కార్యాలయ ఆవరణలో తాను నాటిన మొక్క(కదంబం) వద్ద కాసేపు ఆగి పులకించి పోయారు. స్వతహాగా తాను వృక్ష ప్రేమికుడినని, నేడు ఈ చెట్టును చూస్తే సంతోషంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా మీ పరిధిలో ఇప్పటివరకు నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ప్రజలను కోరారు. హరిత తెలంగాణ దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.logo