గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Jul 26, 2020 , 02:29:09

వనస్పతికి చెప్పేద్దాం గుడ్‌బై!

వనస్పతికి చెప్పేద్దాం గుడ్‌బై!

  • భారతీయ వంటకాల్లో వనస్పతి ఒక భాగం. 

ఫంక్షన్లలో వనప్పతి వాడకుండా వంట చేయడం అరుదు. తక్కువ ధరకు వస్తుందని, ఆహారం రుచిగా ఉంటుందని చాలా మంది వీటిని వాడతారు. అయితే ఇది ఆరోగ్యానికి చేటు చేస్తుందని చాలా మందికి తెలియదు. 

వనస్పతిలో ఉండే ట్రాన్స్‌ఫ్యాటీ ఆమ్లాలు(టీఎఫ్‌ఏ) మధుమేహం, అల్జీమర్స్‌, గుండెజబ్బులకు దారి తీస్తాయి. డిమాండ్‌ దృష్ట్యా అనేక కంపెనీలు నూనెలను హైడ్రోజినైజేషన్‌ చేయడం వల్ల వాటిలో టీఎఫ్‌ఏలు పెరుగుతున్నాయి. అందుకే వంటనూనెల్లో టీఎఫ్‌ఏ స్థాయిని తగ్గించాలని, వనస్పతి వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌వో), భారత ఆహార భద్రత, నియంత్రణ సంస్థ(ఎఫ్‌ఎస్‌ఏఏఐ) లక్ష్యంగా  పెట్టుకున్నాయి. 2023 నాటికి వంటనూనెల్లో  ఎఫ్‌టీఏల శాతాన్ని 0.2 శాతానికి తగ్గించాలని డబ్ల్యూహెచ్‌వో లక్ష్యంగా పెట్టుకోగా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2022వరకే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకున్నది. అయితే ఈ రెండు సంస్థలు అనుకున్నంత వేగంగా లక్ష్యం వైపునకు సాగడం లేదు. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం రోజువారి ఆహారంలో టీఎఫ్‌ఏలు 2.2 గ్రాములకు మించకూడదు. ఇప్పటికే ఎన్నో వ్యాధులతో పోరాడుతున్న మనం కొత్తగా మళ్లీ కొవ్వు ఆమ్లాల రూపంలో జబ్బులను కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే వనస్పతి వాడకానికి గుడ్‌ బై చెప్పాల్సిన అవసరం ఉన్నది. logo