బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 14:33:40

నల్లగొండ జిల్లాలో 7,000 మొక్కలు నాటిన టీఆర్ఎస్ శ్రేణులు

నల్లగొండ జిల్లాలో 7,000 మొక్కలు నాటిన టీఆర్ఎస్ శ్రేణులు

నల్లగొండ : జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. హాలియ మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం నిడమానూరు మండలంలోని గుంటిపల్లి గ్రామంలోని సోషల్ ఫారెస్ట్ లో 7,000 మొక్కలు నాటారు. మొక్కలు నాటే  కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు నోముల నర్సింహ్మయ్య, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల  భూపాల్ రెడ్డి ప్రారంభించారు. 

కార్యక్రమంలో జడ్పీ  వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, హాలియ మున్సిపల్ చైర్మన్  వెంపటి పార్వతమ్మ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్ నాయక్, నిడమానూరు ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ  నందికొండ రామేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.


logo