గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:40

శ్రీశైలం @ 78.56 టీఎంసీలు

శ్రీశైలం @ 78.56 టీఎంసీలు

  • ఎగువ నుంచి కొనసాగుతున్న వరద 
  • 86,037 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  • జూరాలలో 8 గేట్లు ఎత్తి నీటి విడుదల    

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతోపాటు పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది. మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 86,037 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  నమోదవుతున్నది. గురువారం సాయంత్రానికి రిజర్వాయర్‌లో 885 అడుగులకుగాను 849.30 అడుగులకు నీటిమట్టం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ఎడమ గట్టు భూగర్బ జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి ద్వారా 42,375 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నది. జూరాలకు ఇన్‌ఫ్లో 74 వేల క్యూసెక్కులు నమోదైంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 52,033 క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 45,415 క్యూసెక్కుల వరద నమోదైంది.  

లక్ష్మి బరాజ్‌లో 10.625 టీఎంసీల నీరు 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన లక్ష్మి బరాజ్‌లో 10.625 టీఎంసీల నీరున్న ట్లు అధికారులు తెలిపారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదీ ప్రవాహం గోదావరిలో కలిసి లక్ష్మి బరాజ్‌కు వచ్చి చేరుతున్నది. గురువారం బరాజ్‌లో 44,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 24 గేట్లు ఎత్తి 43,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

వివిధ ప్రాజెక్టులలో గురువారం నాటి నీటిమట్టాల వివరాలు

రిజర్వాయర్‌ పూర్తి నీటి మట్టం  ప్రస్తుత నీటిమట్టం పూర్తిసామర్థ్యం ప్రస్తుతం ఇన్‌ఫ్లో అవుట్‌ఫ్లో

(అడుగుల్లో) (అడుగుల్లో) (టీఎంసీల్లో) (టీఎంసీల్లో ) (క్యూసెక్కుల్లో) (క్యూసెక్కుల్లో)

ఆల్మట్టి 1705 1696.69 129.72 89.60 52.033 46130

నారాయణపూర్‌ 1615 1613.32 37.64 35.51 45415 45785

జూరాల 1045 1044.458 9.66 9.316 74000 78183

తుంగభద్ర 1633 1610.16 100.86 35.553 14,285 288

శ్రీశైలం 885 849.30 215.81 78.569 86,037 42,375

నాగార్జునసాగర్‌ 590 535.80 312.05 179.69 42,375 1000

శ్రీరాంసాగర్‌ 1091.0 1073.60 90.313 36.528 7,446 6,904logo