మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 12:54:24

హరితహారంలో అధికారుల పాత్ర ప్రశంసనీయం

హరితహారంలో అధికారుల పాత్ర ప్రశంసనీయం

వికారాబాద్ : హరితహారంలో అధికారుల చొరవ ఎంతో గొప్పదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని పరిగి నియోజకవర్గ సలిప్పల బాట తాండ పరిధిలోని లో ని అటవీ శాఖ భూమిలో  ఆరో విడుత హరితహారం లో భాగంగా స్థానిక శాసన సభ్యుడు కొప్పుల మహేష్ రెడ్డితో  కలిసి మంత్రి మొక్కలు నాటారు. 

అనంతరం 35 వేల మొక్కలు నాటిన ప్రాంతాలను పరిశీలించి  ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ ఆహి ని, అటవీశాఖ అధికారులను అభినందించారు.  నాటిన మొక్కలను సంరక్షించాలి. అటవీ భూమిలో ఇటీవల నాటిన మొక్కలు బాగున్నాయని, ఇదే స్ఫూర్తితో అందరూ పనిచేయాలని మంత్రి సూచించారు.logo