మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 19:20:07

రాష్ట్రంలో స్వయం స‌హాయక సంఘాల‌ పని తీరు భేష్

రాష్ట్రంలో స్వయం స‌హాయక సంఘాల‌ పని తీరు భేష్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తుందని, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత  కార్యక్రమాలు, ప‌థ‌కాల్లోనూ నెంబ‌ర్ వ‌న్ గా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధి హామీలోనూ నిర్ణీత లక్ష్యాన్ని ముందే  సాధించామన్నారు. తాజాగా స్వయం స‌హాయ‌క సంఘాల‌కు రుణ అన‌సంధానంలోనూ ఈ ఏడాది మొద‌టి త్రైమాసికానికే.. తెలంగాణ దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని నేష‌న‌ల్ రూర‌ల్ లైవ్ వీ వుడ్స్ మిష‌న్ వెల్లడించిందని తెలిపారు . 

దేశంలోని  స్వయం స‌హాయ‌క సంఘాల్లో 36.37శాతంతో ఉన్నప్పటికి ఆయా సంఘాల‌కు ఆర్థిక రుణ అనుసంధానంలో మాత్రం.. దేశంలో మ‌రే రాష్ట్రం సాధించ‌ని రీతిలో మొద‌టి త్రైమాసికానికే 17.56 శాతం ల‌క్ష్యాన్ని సాధించి తెలంగాణ  మొద‌టి స్థానంలో నిలిచిందన్నారు.  కాగా, స్వయం స‌హాయ‌క సంఘాల‌కు రుణ అనుసంధానంలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ గా నిల‌వ‌డంపై  ఎర్రబెల్లి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, సమర్థవంతమైన పాల‌న ‌వ‌ల్లే ఇది సాధ్యమైందన్నారు.  ఇక స్త్రీనిధి సంస్థ ఆధ్వర్యంలో మామిడి, బ‌త్తాయి, బొప్పాయి పండ్ల వ్యాపారాన్ని సైతం విజ‌య‌వంతంగా నిర్వహించారన్నారు. కుటీర పరిశ్రమలు మ‌హిళలు చేప‌ట్టిన అనేక ప‌థ‌కాలు విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయ‌న్నారు.

 మ‌హిళ‌ల‌కు రుణ అనుసంధానానికి స‌హ‌క‌రించిన బ్యాంకర్లను, సమర్థవంతంగా ప‌ని చేస్తున్న రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, పేద‌రిక నిర్మూల‌న సంస్థ, సెర్ప్ ముఖ్య  కార్యనిర్వాహణ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, సంబంధిత శాఖ‌ల అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌హిళా సంఘాల‌ను మంత్రి  అభినందించారు. త‌మ కృషితో రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్ గా నిలిపినందుకు అంద‌రికి శుభాకాంక్షలు తెలిపారు. 




logo