గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 18:40:42

అయోధ్య భూమిపూజకు బాసర పవిత్ర గోదావరి జలం, మట్టి సేకరణ

అయోధ్య భూమిపూజకు బాసర పవిత్ర గోదావరి జలం, మట్టి సేకరణ

నిర్మల్ :  ఆగస్ట్ 5న, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామాలయ నిర్మాణ శంకుస్థాపన చేయనున్నారు. దాని కోసం యావత్  దేశములోని పవిత్ర దేవాలయాల నుంచి జలం, మట్టిని సేకరించి, రామాలయ శంకుస్థాపన కోసం వాడనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఇందూర్ విశ్వ హిందు పరిషత్ ఆధ్వర్యంలో, బాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి నది జలం, అమ్మవారి ఆలయ ప్రాంగణము నుంచి పవిత్ర మట్టిని తీసుకున్నారు. ఈ పవిత్ర మట్టి, జలాన్ని అయోధ్యకు పంపిస్తామని వారు తెలిపారు.


logo