గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 16:34:15

పరిశుభ్రతను యజ్ఞంలా చేపడుదాం : మంత్రి ఎర్రబెల్లి

పరిశుభ్రతను యజ్ఞంలా చేపడుదాం : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ :  మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు ప్రతి ఆదివారం ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాల కార్యక్రమంలో  భాగంగా.. పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి  ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు వరంగల్ రూరల్ జిల్లా  పర్వతగిరిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పారిశుద్ధ్య ప‌నులు  చేపట్టారు. మొక్కలకు పాదులు తీసి నీళ్లు పట్టారు. ఇంట్లో నీటి నిలువ‌లు లేకుండా చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి  మాట్లాడుతూ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపును అందరూ పాటించాలన్నారు.


 ప్రతి ఆదివారం ప‌ది గంట‌ల‌కు, ప‌ది నిమిషాలు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. ఈ సీజన్ లో అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని మంత్రి పేర్కొన్నారు. ఇంటితోపాటు, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని రోగ ర‌హితంగా ఉంచ‌వ‌చ్చని సూచించారు. అలాగే  ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


logo