శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 18, 2020 , 16:47:42

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన నటుడు అభినవ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన నటుడు అభినవ్

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరం మొక్కలు నాటాలని నటుడు అభినవ్ గోమాటం అన్నారు. నటుడు విశ్వక్ సేన్  విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ .. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లోని పార్క్ లో నటుడు అభినవ్  గోమాటం మొక్కలు నాటారు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్  అందరూ స్వీకరిస్తూ మొక్కలు నాటాలన్నారు. తను మరో ముగ్గురు ( యాక్టర్స్  సుశాంత్ అనుములు,  సాయి సుశాంత్ రెడ్డి , నటి సిమ్రాన్  చౌదరి ) లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


logo